RS Praveen Kumar | హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది గౌలిదొడ్డి(బాయ్స్) గురుకులంలో చదువుతూ ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందలేదు. గొప్ప చదువులు చదవాలనుకునే గురుకుల విద్యార్థులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
అయితే తమకు ల్యాప్టాప్స్ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు గురుకుల విద్యార్థులు ఓ మేసేజ్ చేశారు. ఈ మేసేజ్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మీరు హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు హెలికాప్టర్లో పోయిన ఖర్చుతో ఈ పేద బిడ్డలకు మంచి ల్యాప్టాప్స్ పంపిణీ చేయవచ్చు. రూ. 32 వేల ప్లేటు మీల్స్ గురించి నేను మాట్లాడను అని రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చురకలంటించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్.. మేం టీఎస్‌డబ్ల్యూఆర్ సీవోఈ గౌలిదొడ్డి(బాయ్స్)కి చెందిన విద్యార్థులం. మేం ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించాం. మా ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దీంతో మేం సొంతంగా ల్యాప్టాప్స్ కొనలేని పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు గురుకుల సొసైటీ ల్యాప్టాప్స్ అందజేసేది. ఈ ఏడాది అది జరగలేదు. పాత ల్యాప్‌టాప్స్‌ను కొంతమంది విద్యార్థులకు పంపిణీ చేశారు. అవి కూడా సరిగా పని చేయడం లేదు. మరో 23 మందికి ఇప్పటి వరకు ఎలాంటి ల్యాప్టాప్స్ అందలేదు. ఈ క్రమంలో సొసైటీ నుంచి ల్యాప్టాప్స్ అందేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అభ్యర్థించారు.
.@TelanganaCMO @TGSWREIS @revanth_anumula @Bhatti_Mallu @UttamINC @Ponnam_INC
మీరు హైదరాబాదు నుండి కరీంనగర్ కు హెలికాప్టర్ లో పోయిన ఖర్చుతో ఈ పేద బిడ్డలకు మంచి ల్యాప్ టాప్స్ సప్లై చేయవచ్చు. ₹32K ప్లేటు మీల్స్ గురించి నేను మాట్లాడను pic.twitter.com/AvFcfy585Z— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 23, 2025
ఇవి కూడా చదవండి..