సంగారెడ్డి : పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గంలోని ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బూతులు తిట్టారని ఆరోపిస్తూ సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్చెరు స్లోగన్‌తో స్థానిక కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న కుర్చీలను పగలకొట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గం కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పాత, కొత్త నేతల పంచాయితీ సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పటాన్చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులను మోరించారు.
పటాన్చెరులో గూడెం మహిపాల్ రెడ్డి v/s కాటా శ్రీనివాస్ గౌడ్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపు
పటాన్చెరు చౌరస్తా వద్ద మోహరించిన పోలీసులు
సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్చెరు స్లోగన్ తో రోడ్డెక్కిన కార్యకర్తలు, నాయకులు
పార్టీ… pic.twitter.com/FpqRBH8GTi
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2025