Rajeev Sagar | హైదరాబాద్ : తెలంగాణలో చావు రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని తెలంగాణ పుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ సీటు పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. పెనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరికిందనే చందా రేవంత్ తీరు ఉందన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే క్షేత్రస్థాయిలో ప్రజలు పిచ్చి కుక్కకు బుద్ది చెప్పినట్లు బుద్ది చెబుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చావు రాజకీయాలను కోరుకుంటుందన్నారు.
మూసీ సుందరీకరణ కంటే ముందు రేవంత్ రెడ్డి నోరును శుద్ది చేయాలన్నారు. మూసీ సుందరీకరణ హైదరాబాద్‌లో చేస్తే మరీ ఎందుకు నల్గొండ జిల్లాలో యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. నగరంలో యాత్ర చేస్తే హైడ్రా బాధితుల ఊరికించి తరిమి కొడతారని భయమా అన్నారు. అసలు డీపీఆర్ కానీ మూసీ సుందరీకరణ గురించి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంత రాద్దాంతం చేస్తుందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమకారులపైకి సీమాంధ్ర తొత్తుగా గన్ను ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంతా తేడా ఉందన్నారు. పుట్టిన రోజున నీ కంటే వయసులో పెద్ద వాళ్ల ఆశీస్సులు తీసుకోవాల్సింది పోయి కేసీఆర్‌ను తిట్టడం రేవంత్ రెడ్డికే చెల్లిందన్నారు. కేసీఆర్‌ను వారి కుటుంబాన్ని తిట్టనిదే రేవంత్ రెడ్డికి పూట గడవడం లేదా అని రాజీవ్ సాగర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి..! సీఎంపై హరీశ్‌రావు ధ్వజం
500 Fake Notes | స్టాంప్ పేపర్‌పై రూ.500 నోట్లు ముద్రించారు.. తర్వాత ఏం జరిగిందంటే?
SSC Exam Fee | పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
Telangana | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. తదుపరి విచారణ 11కు వాయిదా