Krishank | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణను బీఆర్ఎస్ పార్టీతో పాటు పలువులు తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా పెడుతారని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్.. ఓ ఫొటోను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు.. నాడు ఏపీ సీఎంగా ఉన్న అంజయ్యను పబ్లిక్‌లోనే బఫూన్ అని పిలిచి రాజీవ్ గాంధీ తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు. రాజీవ్ మాటలకు అంజయ్య ఏడుస్తూ కనిపించారు. అదే నెలలో అంజయ్యు సీఎం పదవి నుంచి తొలగించారు. అలా అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందుకు ఎందుకు..? అవసరమా..? అని రేవంత్ సర్కార్‌ను క్రిశాంక్ నిలదీశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Rajiv Gandhi ji called Chief Minister Anjaiah garu a “Buffoon” in public and Anjaiah garu was seen crying in public. In the same month he was removed from the CM Post.
Why Rajiv Gandhi ji’s Statue in Telangana Ambedkar Secretariat ❓❓ pic.twitter.com/EM2YTjBjkI
— Krishank (@Krishank_BRS) September 16, 2024
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా: కేటీఆర్
Revanth Reddy | సీఎం.. అశోక్‌నగర్ రా తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డికి ఓ నిరుద్యోగి సవాల్
MLA KP Vivek | కౌశిక్‌రెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డే సూత్రధారి: ఎమ్మెల్యే కేపీ వివేక్