Revanth Reddy | హైదరాబాద్ : నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. అదే నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోంది. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగ నియామకాలపై రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఓ నిరుద్యోగి మండిపడ్డాడు.
65 వేల ఉద్యోగాలు తాను ఇచ్చానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. అశోక్‌నగర్‌కు వచ్చి అదే మాట చెప్పగలవా..? అని ఓ నిరుద్యోగి నిలదీశాడు. ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. చివరకు 65 వేలు అని చెబుతున్నాడు. ఆ 65 వేల ఉద్యోగాల్లో కేసీఆర్ ఇచ్చినవే 30 వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని అతను తెలిపాడు. ఏదో పీకి కట్టగడుతావని తాము కష్టపడి ఎన్నికల్లో ప్రచారం చేసి నిన్ను గెలిపించాం. ఇప్పుడేమో నిరుద్యోగులను లెక్క చేయడం లేదు. కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా 65 వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటు అని రేవంత్ రెడ్డిపై ఆ నిరుద్యోగ యువకుడు నిప్పులు చెరిగారు. దమ్ముంటే అశోక్‌నగర్ రా.. తేల్చుకుందాం అని సవాల్ విసిరాడు ఆ నిరుద్యోగి.
అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్,
65 వేల ఉద్యోగాలు నేనే ఇచ్చినా అని
అశోక్ నగర్ వచ్చి చెప్పగలవా?సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల నుండి 65 వేలకు తెచ్చిండు,
3 రంగుల జెండా పట్టుకుని ఈయన ఏదో పీకి కట్టగడతాడని ఓట్లు వేయించిన నిరుద్యోగులు ఇప్పుడెక్కడున్నారు? pic.twitter.com/FVQDTlpXhC— Hi Kollapur (@HiKollapur) September 16, 2024
ఇవి కూడా చదవండి..
Maneru Dam | నిండు కుండలా మానేరు డ్యాం.. రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
KTR | మోదీ జీ.. 4 నెలలైనా ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలు తీసుకోలేదు ఎందుకు: కేటీఆర్
KTR | తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా: కేటీఆర్