హైదరాబాద్: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరును ఖండించారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్ఛమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా అని ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా అంటూ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిని ఆవమానిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ను క్షమించదంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.
‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?
తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.. తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?
నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. ‘తెలంగాణ తల్లి’ విగ్రహం పెట్టాల్సిన చోట ‘రాహుల్ గాంధీ తండ్రి’ విగ్రహం పెడతారా..??
తెలంగాణ కాంగ్రెస్ను క్షమించదు..!’ అంటూ ట్వీట్ చేశారు.
సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని కేటీఆర్ గతంలోనే తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ విగ్రహాన్ని తొలగించి.. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠామని స్పష్టం చేశారు.
తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?తెలంగాణ… pic.twitter.com/zLV0I2aQeZ
— KTR (@KTRBRS) September 16, 2024