Errolla Srinivas | హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నామని ఎస్టీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
‘సుదీర్ఘ సమస్యకు నేడు పరిషారం లభించింది. ఎన్నో ఏండ్ల్ల పోరాటానికి ఫలితం లభించింది. ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కింది. దశాబ్దాల కల నెరవేరింది. దళితులందరికీ ఇది పండుగ రోజు. ఇంటింటా సంబురాలు జరుపుకొనే రోజు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించారు. అదే తీర్మానం కాపీతో దళిత నాయకులను ఢిల్లీకి వెంట తీసుకెళ్లి ప్రధాని మోదీకి కలిసి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత, వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లలో, విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలి’ అని గురువారం ఒక ప్రకటనలో కోరారు.
ఇవి కూడా చదవండి..