Errolla Srinivas | హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు బయట ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
నాపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వంపై ధర్మం గెలిచింది. అధర్మం ఓడింది. కోర్టు నిబంధనలు తప్పకుండా పాటిస్తాను. నాకు అండగా నిలిచిన కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు గులాబీ పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు. క్షణం, క్షణం ఈ కేసు వ్యవహారాలను పరిశీలిస్తూ, బెయిల్ కోసం కృషి చేసిన బీఆర్ఎస్ లీగల్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను గురువారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ. 5 వేల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. కిమ్స్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీశ్‌రావు
Rains | హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..
CM Revanth Reddy | తెలుగు సినిమా బ్రాండ్ క్రియేట్ చేయాలి.. సినీ ప్రముఖుల భేటిలో సీఎం రేవంత్ రెడ్డి