CM Revanth Reddy | సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో చర్చకు వచ్చిన కీలక అంశాలివే..!
CM Revanth Reddy | తెలుగు చిత్రసీమ (Telugu cinema Industry)కు సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో భాగంగా సినిమా పరిశ్రమకు కూడా ప్రజాప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు.
CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజాప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. తెలుగు చిత్రసీమ (Telugu cinema Industry)కు సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు.
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..
తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోందని సీఎం గుర్తుచేశారు. పరిశ్రమ పురోభివృద్ధికి, ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులకు సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ క్రియేట్ చేయాలి..
పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందన్నారు.
దేశంలోని కాస్మోపాలిటన్ సిటీల్లో సినిమా పరిశ్రమ ఎదుగుదలకు హైదరాబాద్ బెస్ట్ సిటీ అని సీఎం పేర్కొన్నారు.తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ పేరుతో అవార్డును ఏర్పాటు చేశామని.. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధాన కర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నియమించామన్నారు.
ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం..
తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్‌కు రెండు గంటల్లో రావొచ్చు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి. పరిశ్రమను నెక్ట్ప్ లెవల్‌కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. గంజాయి, డ్రగ్స్‌తోపాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి. గతంలో సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయని.. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశమని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు. తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణానికి అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా , డీజీపీ జితేందర్, సినీ రంగానికి చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు.సినీ పరిశ్రమ నుంచి సురేష్ బాబు, కేఎల్ నారాయణ, మురళీమోహన్, కే.రాఘవేందర్ రావు, కొరటాల శివ, వెంకటేశ్, నాగార్జున , అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోపాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
Read Also :
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

