Dasoju Sravan | హైదరాబాద్ : హైడ్రా బుల్డోజర్లు పేద బతుకులను చిదిమేస్తున్నాయి. హైడ్రా నుంచి పెద్దోళ్లు ఏదోలా బయటపడుతున్నా, పేదల జీవితాలే అతలాకుతలమైపోతున్నాయి. కట్టుబట్టలతో నడిరోడ్డున పడుతున్నారు.. వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఈ హైడ్రా బుల్డోజర్ అరాచకాలపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
హైదరాబాద్‌లోని షేక్‌పేట పరిధిలోని బాతుర్ కుంటను కబ్జా చేసి పెద్దరెడ్డి ఎవరు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాసోజు శ్రవణ్ నిలదీశారు. ఈ కుంటలో నిర్మించబడుతున్న వేల కోట్ల అతి ఖరీదైనా అక్రమ కట్టడాలను కూల్చేసే దమ్ము రేవంత్ రెడ్డి, రంగనాథ్‌కు ఉందా..? అని ప్రశ్నించారు. సడీ సప్పుడు కాకుండా.. గాదెకింది పందికొక్కులెక్క వసూళ్ల సొమ్ము తెగమించి, గమ్మున ఉన్న బ్లాక్ మెయిలర్ నేతలు ఎవరు..? అని రేవంత్ సర్కార్‌ను దాసోజు శ్రవణ్ నిలదీశారు.
అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసున్నట్టు హైడ్రా ప్రకటించింది. ఇందులో 90 శాతం ఇండ్లు దిగవ మధ్య తరగతి, నిరుపేదలవే. పొద్దంతా కాయకష్టం చేసి రూపాయి, రూపాయి కూడ బెట్టుకొని కట్టుకున్న ఇండ్లు అవి. నోటీసులు లేకుండా పిడుగు వచ్చి మీద పడ్డట్టు కండ్ల ముందే కూలగొడుతుంటే కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా కనికరించకపోగా, పైపెచ్చు అధికారుల పనులకు ఆటంకం కలిగించారంటూ క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
అదే సమయంలో ఎదురు తిరిగిన పెద్దలకు మాత్రం ప్రైవేటుగా నష్టపరిహారాలతో హైడ్రా మోకరిల్లుతున్నది. హైడ్రా చేతిలో ఇటీవలే ఇంటిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సమస్యను ఢిల్లీలోని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తే నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు ముట్టజెప్పినట్టు తెలిసింది. అంతేకాదు, గండిపేట చెరువు కిందనే ఉన్న మరో ఇంటిని కూలగొట్టబోమనే హామీ ఇచ్చి బయటపడినట్టు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది.
బాతుర్ కుంటను కబ్జా
చేసిన పెద్దరెడ్డి ఎవరు?శ్రీ రేవంత్ రెడ్డి; శ్రీ రంగనాథ్ లకు
ఇక్కడ నిర్మింపబడుతున్న వేల కోట్ల
అతి ఖరీదైనా అక్రమ కట్టడాలను
కూల్చివేసే దమ్ముందా???సడీ సప్పుడు కాకుండా
గాదెకింది పందికొక్కులెక్క
వసూళ్ల సొమ్ము తెగమింగి
గమ్మున ఉన్న బ్లాక్‌మెయిలర్… pic.twitter.com/AvLSqV8Qja— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) September 16, 2024
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | సీఎం.. అశోక్‌నగర్ రా తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డికి ఓ నిరుద్యోగి సవాల్
MLA KP Vivek | కౌశిక్‌రెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డే సూత్రధారి: ఎమ్మెల్యే కేపీ వివేక్