Rasamai Balakishan | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి గద్దెనెక్కి నేటికి ఏడాది పూర్తయింది. అయినా ఏం లాభం.. ఏ ఒక్క హామీ నెరవేరలేదు. అభివృద్ధి, సంక్షేమానికి చోటే లేదు. హామీలన్నీ నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి. ప్రజలకు కన్నీళ్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. రేవంత్ సర్కార్‌ను విమర్శిస్తూ ఓ పాటను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఆ పాటను తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రసమయి బాలకిషన్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
4 నిమిషాల 28 సెకన్ల నిడివి గల ఈ పాటలో రేవంత్ హామీలను చెబుతూనే.. వాటికి సెటైరికల్‌గా రసమయి తన పాటను ఆలపించారు. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు ఎక్కడా అంటూ ఎండగట్టారు. కాంగ్రెస్ హామీలన్నీ నీటి మీద రాతలుగానే మిలిగిపోయాయని పేర్కొన్నారు. ఈ రేవంత్ రెడ్డిని ఓట్లేసే గెలిపిస్తే.. తెలంగాణకు పాణగండం అయిపాయే ఓరి దేవుడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్ష రూపాయాలు, తులం బంగారం, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రుణమాఫీ, రైతుభరోసా, రైతుకూలీ, అన్ని వడ్లకు బోనస్.. అన్నీ ఉత్తయే అని పేర్కొన్నారు. ఈ బ్యాగు పార్టీ మాటలన్నీ నీటి మూటలే అని విమర్శించారు. నమ్ముకున్న రైతులను నిండా ముంచెనే అని రేవంత్ రెడ్డిని రసమయి దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి సంవత్సర పాలన మీద పాట విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ pic.twitter.com/C168z5w3OD
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2024
ఇవి కూడా చదవండి..
Telangana Talli | డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని హైకోర్టులో పిటిషన్
KTR | అధికారం మాత్రమే పోయింది.. బీఆర్ఎస్పై ప్రజల్లో అభిమానం ఏ మాత్రం తగ్గలేదు : కేటీఆర్
KTR | ఈ ఏడాదిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం.. ‘నమ్మి నానబోస్తే’ షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూలో కేటీఆర్