Telangana Talli | హైదరాబాద్ : తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతూనే ఉంది. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మేధావులు గళం విప్పుతున్నారు. రేవంత్ రెడ్డి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు,కవులు, కళాకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్త్వం జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తుంది.
ఇవి కూడా చదవండి..
KTR | అధికారం మాత్రమే పోయింది.. బీఆర్ఎస్పై ప్రజల్లో అభిమానం ఏ మాత్రం తగ్గలేదు : కేటీఆర్
KTR | ఈ ఏడాదిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం.. ‘నమ్మి నానబోస్తే’ షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూలో కేటీఆర్
Telangana Thalli Statue | తెలంగాణ తల్లా? కాంగ్రెస్ తల్లా?.. రూపు మార్చడమా? రూపు మాపడమా?