గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 06:27:25

నేడు తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం

నేడు తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖమంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం 10గంటలకు తెలంగాణభవన్‌లో రక్తదానశిబిరం నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. అనంతరం కేటీఆర్‌పై రూపొందించిన పాటల సీడీని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ విప్‌ కర్నెప్రభాకర్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరిబాలమల్లు, రాష్ట్ర ఫౌరసరఫరాల సంస్థచైర్మన్‌ మారెడ్డిశ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు. 


logo