పోలింగ్ కేంద్రాల్లో..ఐడీ ఉంటేనే ఎంట్రీ
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కనీస వసతులు కల్పించాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సూచించారు.
- హైదరాబాద్ ఆర్వో, జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కనీస వసతులు కల్పించాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్వాన్, బహదూర్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్ కేంద్రాలు, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని చార్మినార్ డీఆర్సీలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలన్నారు
. చల్లని తాగునీరు, కరెంటు, టాయిలెట్స్, షెడ్స్, షామియానా, ఫర్నిచర్, కూలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లోకి గుర్తింపు కార్డు లేని వారిని అనుమతించవద్దని ఆదేశించారు. అంతకు ముందు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని డీఆర్ఎసీలో ఉన్న పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. హోం ఓటింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచి పటిష్ట భద్రత మధ్య ఉంచాలన్నారు. మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

