ఉద్వేగంతో కాదు.. విజ్ఞతతో ఆలోచించండి
పదేండ్ల కాలంలో కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలను చూడాలని, ఉద్వేగంతో కాకుండా విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
- అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు పట్టంకట్టండి
- ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండి
- కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ షోలో.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కేపీహెచ్‌బీ కాలనీ, మే 10: పదేండ్ల కాలంలో కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలను చూడాలని, ఉద్వేగంతో కాకుండా విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీలో నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ, పదేండ్ల కాలంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిందన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, బీసీ బంధు లాంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్దన్నారు. కూకట్‌పల్లిలో కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు చేపట్టానని, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రిజర్వాయర్లు, పైపులైన్ వ్యవస్థలను ఆధునీకరించామని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు, అండర్ పాసులు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడటం వల్ల అంతర్జాయతీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో ప్రజలంతతా సంతోషంగా జీవిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ నేత లు కుట్రలు పన్నుతున్నారని, వారి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. కులాలు, మతాలుగా ప్రజలను విభజిస్తూ ఓట్లు రాబట్టేందుకు ఆ పార్టీలకు బుద్ది చెప్పాలని, నిత్యం అందుబాటులో ఉండి సేవలందించే రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పగుడాల శిరీషా బాబూరావు, డివిజన్ల అధ్యక్షులు ఎం.కృష్ణారెడ్డి, ప్రభాకర్‌గౌడ్, ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, బీఆర్ఎస్ పార్టీల నేతలు, మహిళా నేతలు, యువకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

