Weather Update | రాష్ట్రంలో నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
Weather Update | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండ, యా దాద్రి, సూర్యాపేట, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షం కురిసిందని వెల్లడించారు. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
5 శాతం అధిక వర్షపాతం
రాష్ట్రంలో 2023 జూన్ 1 నుంచి మే 10 వరకు 5 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. 2023 జూన్ 1 నుంచి 2024 మే 10 వరకు సాధారణ వర్షపాతం 899.1 మి.మీ కురవాల్సి ఉండగా, 948 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

