Revanth vs Etela | హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళన విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మూసీ బాధితులను కావాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. మూసీ బాధితులను తాను రెచ్చగొడుతున్నాను కదా.. మీరు చేస్తున్నది మంచి పని అని మూసీ బాధితులు మిమ్మల్ని మెచ్చుకుంటే బహిరంగంగా ముక్కు నేలకు రాసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా.. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే.. ఎలాంటి భద్రత లేకుండా మన ఇద్దరం కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిద్దాం. నీవు ఇవాళ ఏ ఇండ్లు అయితే కూలగొడుతున్నావో.. అక్కడికి ఇద్దరం కలిసి పోదాం. మీరే తేదీ చెప్పండి.. తప్పకుండా పోదాం. చైతన్యపురి, ఫణిగిరి కాలనీల ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు. రేపోమాపో డెలివరీ అయ్యే ఓ తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీని పట్టుకుని.. నువ్వు ఈ ఇల్లును ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఒక వేళ ఇల్లు ఖాళీ చేయకపోతే ఇప్పుడిస్తున్న డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాదని ఆ గర్భిణిని భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులు బలవంతంగా నెట్టేశారు. మరి నేను డెలివరీ ఎక్కడ కావాలని కాళ్ల మీద పడితే.. పోలీసులు కనికరించలేదు. చైతన్యపురి, కొత్తపేట, రామంతాపూర్.. ఎక్కడికి వస్తావో రా పోదాం. శభాష్ రేవంత్ రెడ్డి అని మూసీ బాధితులు అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుని, బహిరంగంగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాస్తా అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి నువ్వు నేను సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్దాం.. నీకు దమ్ముందా – ఈటెల రాజేందర్ https://t.co/2nslu04kuX pic.twitter.com/X2u4nLcNt0
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
ఇవి కూడా చదవండి..
Hyderabad | లాయర్‌పై పోలీసుల దాడి..! డీజీపీ ఆఫీసు ముందు న్యాయవాదుల బైఠాయింపు
Nagarjuna | కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. కోర్టును ఆశ్రయించిన నాగార్జున