Nagarjuna | కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. కోర్టును ఆశ్రయించిన నాగార్జున
Nagarjuna | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు.
Nagarjuna | హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో నాగార్జున కోరారు. శుక్రవారం నాగార్జున పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. అబద్ధం’ అని సినీ నటుడు అక్కినేని నాగార్జున నిన్న ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి.. సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి’ అని సూచించారు. సురేఖ వ్యాఖ్యలను బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మంత్రి కొండా సురేఖ వాఖ్యలు తమ కుటుంబం పట్ల, చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని, అబద్ధమని తేల్చిచెప్పారు. తక్షణమే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సినీనటుడు అక్కినేని నాగార్జున సతీమణి, నటి అకినేని అమల ఫిర్యాదుచేశారు. తన కుటుంబంపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దని, తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు. ‘రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలను వెనకి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్‌గాంధీ చొరవ తీసుకోవాలి’ అని అమల డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Mahesh Babu | చాలా బాధ కలిగించాయి.. కొండా సురేఖ కామెంట్స్ పై మహేశ్ బాబు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

