Hyderabad | హైదరాబాద్ : మూసీ నిర్వాసితులకు కేటాయించబడిన డబుల్ బెడ్రూం ఇండ్లను గతంలోనే తమకు కేటాయించారు కొంత మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ బాధితుల తరపున న్యాయవాది ఎంఏ కలీమ్ కోర్టులో పోరాడుతున్నారు. అయితే కలీమ్‌ను టార్గెట్ చేసిన పోలీసులు, అతని ఇంట్లోకి వెళ్లి దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఓ వాహనంలో ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లి హింసించారు. అసభ్యకరమైన పదజాలంతో తనను దూషించారని బాధిత న్యాయవాది పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఎంఏ కలీమ్‌పై దాడికి పాల్పడ్డ మాదన్నపేట పోలీసులను సస్పెండ్ చేయాలని కోర్టు ముందు లాయర్లు ధర్నాకు దిగారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయాన్ని కూడా న్యాయవాదులు ముట్టడించి నిరసన తెలిపారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులు డీజీపీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైటాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
గత కొంత కాలంగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లాయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కలీమ్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని లాయర్లు హెచ్చరించారు.
మూసీ నిర్వాసితులకు కేటాయించబడిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను గతంలోనే మాకు కేటాయించారు అని కోర్టును ఆశ్రయించిన బాధితులు
ముందుగా కేటాయించిన వాళ్ళ కోసం కోర్టులో పోరాడుతున్న ఓ లాయర్‌పై దాడి చేసిన పోలీసులు.
పోలీసులను సస్పెండ్ చేయాలని కోర్టు ముందు ధర్నాకు దిగిన లాయర్లు. pic.twitter.com/HsEd6Q7v7E
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
ఇవి కూడా చదవండి..
Nagarjuna | కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. కోర్టును ఆశ్రయించిన నాగార్జున
KTR | పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం : కేటీఆర్