DK Aruna | రంగారెడ్డి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ చేతకాని దద్దమ్మ అని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ నిప్పులు చెరిగారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లకు వెళ్తున్న ఎంపీ డీకే అరుణను పోలీసులు మొయినాబాద్ వద్ద అడ్డుకున్నారు. ఆమెను అరెస్టు చేసి నార్సింగి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. పాలనచేతకాక, నన్ను అడ్డకుంటావా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో శాంతి భద్రతలు కంట్రోల్ చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి అని ఆమె మండిపడ్డారు. ఇక ఎంపీ అరుణతో పాటు మరో ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రశ్నిస్తే సంకెళ్లు..! నిలదీస్తే అరెస్టులు..!! కొణతం దిలీప్ అరెస్టుపై మండిపడ్డ కేటీఆర్
Y Satish Reddy | ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపేది లేదు : వై సతీష్ రెడ్డి