కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని నమ్మలేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగల్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయమన్నారు.
తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలుకాబోతున్నాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే కూలుస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే ఒక్క హామీలను అమలు చేయలేదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.