అమరావతి : మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu ) స్పందించారు. శనివారం మహారాష్ట్ర (Maharastra), జార్ఖాండ్ (Jharkand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ( Election results) వెలువడ్డాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి భారీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah),ఫడణవీస్, శిందేకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదు నెలల కిందట ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు గాను 21 మంది ఎన్డీయే సభ్యులు ఎంపీలుగా గెలిచారు.
టీడీపీకి చెందిన 16 మంది, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు, వైసీపీ నుంచి 4గురు ఎంపీలుగా గెలుపొందారు. దీంతో కేంద్రంలో ఎన్డీఏకు మద్దతిస్తున్న పార్టీల్లో టీడీపీ రెండోస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో టీడీపీ కేంద్ర మంత్రివర్గంలోనూ భాగస్వామ్యమై పలు కీలక మంత్రి పదవులను దక్కించుకుంది.