సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో(Siddipet district) దారుణం చోటు చేసుకుంది. ఏడో తరగతి బాలికపై యువకు డు లైంగికదాడికి (Assault )పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కొమురవెల్లి మండలం గురువన్నపేటలో చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితుడి ఇంటిని పెట్రోల్ పోసి తగులబెట్టారు.కారు, జేసీబీని ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.