Asha Workers | హైదరాబాద్ : తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, నోరు పారేసుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాసాచారి తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. పోలీసులు తమకు క్షమాపణలు చెప్పకపోతే పరిస్థితి వేరేలా ఉంటదని ఆశా వర్కర్లు హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమకు రూ. 18 వేలు ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆశా వర్కర్లు వాపోయారు. సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు ఆశా వర్కర్లు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పినా వినకుండా పోలీసులు లాగి పడేశారని కన్నీరు పెట్టుకున్నారు.
ఆశా వర్కర్ కళ్లు తిరిగి పడిపోయినా కూడా పోలీస్ వాళ్లు పట్టించుకోకుండా, దౌర్జన్యంగా వ్యానులో ఎత్తేశారని పేర్కొన్నారు. ఆశా వర్కర్ సృహా తప్పిపోయిందని చెప్పినా కూడా పట్టించుకోకుండా, గంట సేపు ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా సిటీలో తిప్పారు. ఇంకో ఆశా వర్కర్ కూడా తనకు ఒంట్లో బాలేదని చెప్పినా కూడా పోలీసులు మాట వినలేదు. వ్యానులో కుక్కల్లా తిప్పారు కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్ళలేద. మా ఆశా వర్కర్‌కు ఏమైనా అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎస్ఐ శ్రీనివాస్ చారి మా ఆశా వర్కర్‌ను లం* దానా అని తిట్టాడు. మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆశా వర్కర్లు నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆశా వర్కర్లు దుమ్మెత్తి పోశారు. మమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశాడో అంతకంత అనుభవిస్తాడంటూ ఆశ వర్కర్ల వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పోలీస్ వాళ్లతో మమ్మల్ని కొట్టించి, మమ్మల్ని రోడ్డుపైకి లాగించాడు. రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేదంటే ఆశాల తడాఖా ఏంటో చూపిస్తాం అని రేవంత్ రెడ్డిని ఆశా వర్కర్లు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Asha Workers | ఇద్దరు ఆశా వర్కర్ల పరిస్థితి విషమం.. ఉస్మానియాలో చికిత్స
KTR | మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యామా..? సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్
Group-2 Hall Tickets | గ్రూప్-2 హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో తప్పనిసరి.. నిబంధనలు ఇవే..!