Banakacherla | హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): వరద జలాల మాటున పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మరింత దూకుడును పెంచింది. ఇప్పటికే ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విన్నవించిన ఏపీ తాజాగా మరోసారి పూర్తి ప్రతిపాదనలు పంపింది.
పోలవరం నుంచి బనకచర్లకు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 200 టీఎంసీల వరద జలాలను తరలించేందుకు లింక్ ప్రాజెక్టును 81వేల కోట్లతో చేపట్టేందుకు ఏపీ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తిశాఖకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే విన్నవించారు. గత నెలలో జరిగిన భేటీల్లోనూ ప్రధాని, ఆర్థిక మంత్రికి చంద్రబాబు వివరించారు. అయితే ప్రాజెక్టుపై పూర్తిస్థాయి వివరాలను అందివ్వాలని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సమర్పించేందుకు సిద్ధమైంది.
అందులో భాగంగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్ కు ప్రాజెక్టుపై ప్రజంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ప్రాజెక్టు సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు వివరించనున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభ నష్టాలపై, తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై కూడా ప్రజంటేషన్ లో సమాధానం ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. మేఘా కంపెనీ ప్రాజెక్టు ప్రజంటేషన్ను ఏసీ సీఎం, అధికారులకు వివరించడం గమనార్హం.
Read More :
ఏపీ జల దోపిడీ-Namasthe Telangana (ntnews.com)
Banakacherla | రోజుకు నాలుగు టీఎంసీలు.. బనకచర్ల వెనక ఆంధ్రప్రదేశ్ భారీ స్కెచ్