కారేపల్లి, ఫిబ్రవరి 24 : కారేపల్లి- పేరుపల్లి మధ్య బీటీ, సీసీ రోడ్డు పనులను ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకూబ్ మంగళవారం పరిశీలించారు. కారేపల్లి సోసైటీ కార్యాలయం సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జీ పనులను ఆయన పరిశీలించారు. కోమరం భీం సెంటర్ నుండి పేరుపల్లి రైల్వేగేటు వరకు సీసీ రోడ్డు పనులను తనిఖీ చేశారు. నిర్మాణంలో తీసుకోవల్సిన చర్యలను ఏఈ, కాంట్రాక్టర్ కు సూచించారు. రహదారి పనులకు వాడుతున్న మెటిరీయల్ నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ లేకుండా చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.