Ambati Rambabu | సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) టాలీవుడ్ సినీ ప్రముఖులు (Film celebrities) ఇవాళ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘పూర్తి పరిష్కారానికి ‘సోఫా’ చేరాల్సిందే..!’ అంటూ ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
పుష్ప-2 మూవీలో ‘సోఫా’ సీన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను కొనేందుకు, అనుకూలంగా పనిచేసేవాళ్లకు పుష్పరాజ్ ‘సోఫా’ పంపిస్తుంటారు. అందులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంచి లంచంగా ఇస్తుంటారు. ఇదే అంశాన్ని అంబటి రాంబాబు ప్రస్తావిస్తూ.. ‘సోఫా’ పంపితేనే సినీ ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘పుష్ప వివాదానికి.. పుష్పరాజ్ తరహాలోనే పరిష్కారమా..?’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పూర్తి పరిష్కారానికి
“Sofa” చేరాల్సిందే!— Ambati Rambabu (@AmbatiRambabu) December 26, 2024
సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) టాలీవుడ్ సినీ ప్రముఖులు (Film celebrities) ఇవాళ భేటీ అయ్యారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంని కలిశారు. ఈ భేటీలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు చర్చించారు. భేటీ సందర్భంగా చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహాయం అందించాలంటూ సినీ ప్రముఖుల ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. ఇక ఈ భేటీలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా.. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు డగ్స్‌కు వ్యతిరేకంగా యాడ్ ప్లేచేయాలన్నారు.
సీఎంతో భేటీకి అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, సాయి రాజేశ్, సి కల్యాణ్, దామోదర ప్రసాద్, నాగవంశీ, కిరణ్ అబ్బవరం, యూవీ క్రియేషన్స్ అధినేత, రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, శివబాలాజి, నాగార్జున, వెంకటేశ్, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, డైరెక్టర్ శంకర్, మైత్రీ మూవీస్ అధినేత యలమంచిలి రవి, దగ్గుబాటి సురేశ్, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి, గోపీ ఆచంట, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ఇక ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు.
Also Read..
CM Revanth Reddy | అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే: సీఎం రేవంత్
CM Revanth Reddy | ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్
CM Revanth Reddy | సీఎం రేవంత్‌తో సినీ పెద్దల భేటీ.. ఇండస్ట్రీకి ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే