CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) టాలీవుడ్ సినీ ప్రముఖులు (Film celebrities) ఇవాళ భేటీ అయ్యారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంని కలిశారు. ఈ భేటీలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది.
Also Read..
CM Revanth Reddy | సీఎం రేవంత్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఎవరెవరు వెళ్లారంటే..?
CM Revanth Reddy | 10 గంటలకు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి దూరం?
Sai Pallavi | ఎల్లమ్మలో నాయికగా సాయిపల్లవి?