హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖుల భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహాయం అందించాలంటూ సినీ ప్రముఖుల ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. అదేవిధంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా.. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు డగ్స్‌కు వ్యతిరేకంగా యాడ్ ప్లేచేయాలన్నారు.
సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలని తెలిపారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని తేల్చిచెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సినీ ప్రముఖులకు పోలీసులు చూపించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతున్న ఈ సమావేశానికి అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, సాయి రాజేశ్, సి కల్యాణ్, దామోదర ప్రసాద్, నాగవంశీ, కిరణ్ అబ్బవరం, యూవీ క్రియేషన్స్ అధినేత, రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, శివబాలాజి, నాగార్జున, వెంకటేశ్, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, డైరెక్టర్ శంకర్, మైత్రీ మూవీస్ అధినేత యలమంచిలి రవి, దగ్గుబాటి సురేశ్, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి, గోపీ ఆచంట, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ఇక ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొననున్నారు.
Also Read..
CM Revanth Reddy | సీఎం రేవంత్‌తో సినీ పెద్దల భేటీ.. ఇండస్ట్రీకి ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే
CM Revanth Reddy | సీఎం రేవంత్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఎవరెవరు వెళ్లారంటే..?
CM Revanth Reddy | 10 గంటలకు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి దూరం?
Dillraju