నిర్మల్ : నిర్మల్( Nirmal district) జిల్లా కేంద్రంలో రూ.43 లక్షల విలువ చేసే అల్ఫాజోలం(Alprazolam), క్లోరోహైడ్రేట్‌ను ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. అల్ఫాజులం, క్లోరోహైడ్రేట్ నిల్వ చేశారనే విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మల్‌లోని ద్వారకా నగర్లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో సోదాలు చేపట్టారు. అతడి వద్ద నుంచి 3.3 కిలోల అల్ఫాజోలం, అలాగే శాంతినగర్‌లోని ఓ గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు గంధం శ్రీనివాస్ గౌడ్‌కు సోలాపూర్ శీను అలియాస్ భాయ్ అల్ఫాజులంను, రాజస్థాన్‌కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి క్లోరోహైడ్రేడ్ను గత కొంతకాలంగా సప్లై చేస్తున్నారు. వీటితో శ్రీనివాస్ గౌడ్ కల్తీకల్లు వ్యాపారం చేయడమే కాకుండా అల్ఫాజోలం, క్లోరోహైడ్రేట్‌ను ఇతరలకు అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది.. ఇంకా శుద్ధి ఎందుకు: కేటీఆర్
PCC President | జర జాగ్రత్తగా మాట్లాడండి.. కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు పీసీసీ చీఫ్ వార్నింగ్