Sridhar Babu Convoy | సిద్దిపేట : రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని పైలట్ వాహనం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పైలట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 ఏండ్ల బాలుడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి కూడా కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
బాధిత బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు కనీసం పరామర్శించకుండా వెళ్లిపోయారని బాధితులు ఆరోపించారు.
బ్రేకింగ్ న్యూస్
కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు
ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరగగా.. మరో ఇద్దరికి విరిగిన కాళ్ళు
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో హైదరాబాద్ వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ లోని పైలట్… pic.twitter.com/emhmfCBUcO
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది.. ఇంకా శుద్ధి ఎందుకు: కేటీఆర్
PCC President | జర జాగ్రత్తగా మాట్లాడండి.. కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు పీసీసీ చీఫ్ వార్నింగ్
Group-4 Results | గ్రూప్-4 ఫలితాలు ప్రకటించండి.. గాంధీ భవన్‌ను ముట్టడించిన అభ్యర్థులు