Group-4 Results | హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక చోట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రూప్-4 ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్‌ను అభ్యర్థులు ముట్టడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి 2 నెలలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు తుది ఫలితాలు ప్రకటించకపోవడం దారుణమని మండిపడ్డారు.
11 వేల డీఎస్సీ పోస్టులకు 57 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తే.. 8 వేల గ్రూప్-4 పోస్టులకు 2 సంవత్సరాల సమయం తీసుకుంటారా..? అని ప్రశ్నించారు. త్వరితగతిన ఇతర ప్రక్రియ పూర్తి చేసి… ఈ దసరాకి తుది ఫలితాలు కేటాయించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులతో పాటు గ్రూప్-4 అభ్యర్థులకు కూడా దసరా లోపు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. అయితే గాంధీ భవన్‌ను ముట్టడించిన గ్రూప్-4 అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
TG High court | పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్టే ఇచ్చేందుకు నిరాక
Harish Rao | ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం.. హరీశ్ రావుతో ఫార్మాసిటీ బాధిత మహిళలు
Nagarjuna | మంత్రి సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున?