సంగారెడ్డి : ఫార్మా సిటీకి(Pharma City) వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని న్యాల్కల్ మండలం డప్పూరు గ్రామానికి చేరుకున్నారు. కాగా, జహీరాబాద్ వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఇస్నాపూర్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. డప్పూరులో హరీశ్ రావుతో లక్ష్మి, లలిత, లలితమ్మ అనే మహిళలు మాట్లాడారు. మా భూములు ఫార్మా సిటీకి ఇవ్వం, ప్రాణాలు ఇస్తాము కానీ భూములు ఇవ్వమని హరీష్ రావుతో తెగేసి చెప్పారు. హరీశ్ రావు వెంట ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.