e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను ప్రారంభించిన అల్లం నారాయణ

విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను ప్రారంభించిన అల్లం నారాయణ

విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను ప్రారంభించిన అల్లం నారాయణ

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకంగా పని చేశారని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడానికి బయలుదేరుతున్న తెలంగాణ విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను అయాచితం శ్రీధర్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్న తరహా పాలన కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. ఈ మధ్య నీళ్ల విషయంలో విడుదల చేసిన గెజిట్ విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందన్నారు. బీజేపీ పాలనలో యూపీలో దళితులపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని మండిపడ్డారు.

దళితులను పూర్తిగా అణిచివేసేందుకు బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. రిజర్వేషన్ హక్కులను కూడా కాలరాస్తుందని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ చెప్పిన పంచ సూత్రాలకి అనుగుణంగా పాలన చేస్తుందని విమర్శించారు. పెట్రోల్‌, డీజీల ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవితం దుర్భంగా మారిందన్నారు.

- Advertisement -

నాలుగేండ్లలోనే కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టు కట్టుకున్నాం. అయితే రాష్ట్రాల హక్కులను కబళించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగంపై కూడా బీజేపీకి చిన్న చూపు ఉందన్నారు. ఢిల్లీ శివారులో ఇంకా రైతులు పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు.

బయ్యారం ఉక్కు, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని ఆ పార్టీని ప్రశ్నించారు. ఈ జేఏసీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించలన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. హుజూరాబాద్ నుంచే విద్యార్థి విభాగం పోరుబాట పట్టాలి. ఈ యాత్ర విజయ వంతం కావాలని కోరుకుంటున్నామన్నారు.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌, సీపీఐల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు

గ‌న్‌తో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న పోర్న్‌ స్టార్

యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు

రైతు సంఘాలతో పోలీసుల చర్చలు

భాగవత పద్యాలతో మంత్రముగ్ధుల్ని చేసిన సింగపూర్‌ చిన్నారులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను ప్రారంభించిన అల్లం నారాయణ
విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను ప్రారంభించిన అల్లం నారాయణ
విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను ప్రారంభించిన అల్లం నారాయణ

ట్రెండింగ్‌

Advertisement