ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలకు సంబంధించిన సంఘటనలు చాలా వింటున్నాం. సెలబ్రిటీలు సైతం పలు కారణాల వలన ప్రాణం తీసుకుంటున్నారు. తాజాగా పోర్న్ స్టార్ డహ్లియా స్కై (31) ఆత్మహత్య చేసుకుంది. తన కారులో ఉన్న గన్ తీసుకొని కాల్చుకొని చనిపోయింది. ఈ సంఘటన జరిగి రెండు వారాలు అయిన అధికారులు తాజాగా ధృవీకరించారు.
జూన్ 30న శాన్ ఫెర్నాండో వ్యాలీలోని ఓ కారులో డహ్లియా నిర్జీవంగా ఉందని చెప్పిన అధికారులు ఆమె పరిస్థితిని చూసి ఆత్మహత్యే అని పేర్కొన్నారు. కారణం ఏమై ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు. ఆమె స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె డిప్రెషన్‌కు లోనై సూసైడ్ చేసుకుని ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. 2010లో అడల్ట్ స్టార్‌గా కెరీర్ ఆరంభించిన డహ్లియా సుమారు పదేళ్లు పోర్న్ స్టార్‌గా రాణించింది.ఆమె అర్ధాంతరంగా తనువు చాలించడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.