రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచులు(Ex-Sarpanchs) సిరిసిల్ల కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం( Siricilla Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు. సర్పంచ్ల ఫోరం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బాకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన చేస్తున్న తాజా మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు.