ACB | హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి నిఖేశ్ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో 5 ఇండ్లు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ప్లాట్లు, 2 వ్యాపార సముదాయాలకు సంబంధించిన ఆస్తులు బయటపడ్డాయి. స్థిరాస్తులు, చరాస్తులు కలిపి మొత్తం రూ. 17,73,53,500 విలువ చేస్తాయని అధికారులు వెల్లడించారు. కేజీల కొద్ది బంగారం లభ్యమైనట్లు సమాచారం.
ఓ దరఖాస్తుదారుడిని అధికారులు రూ. 2.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయంలో 6 నెలల క్రితం ఏసీబీ సోదాలు జరిగాయి. లంచం తీసుకుంటూ ఈఈ బన్సీలాల్, ఏఈ నిఖేశ్, కార్తీక్ ఏసీబీకి చిక్కారు. ప్రస్తుతం నిఖేశ్ కుమార్ సస్పెన్షన్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..