హైదరాబాద్, మార్చి 13 : కన్జ్యూమర్ ఫ్రెష్ ఫుడ్ బ్రాండ్ ఐడీ ఫ్రెష్.. హైదరాబాద్లో అత్యాధునిక ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.25 కోట్ల వరకు పెట్టుబడితో తీర్చిదిద్దిన ఈ ప్లాంట్ను 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో కొత్తగా 200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. దీంతో దేశంలో రెండో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం ఇదే. సంస్థకు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలలో కేంద్రాలున్నాయి.