హైదరాబాద్, మార్చి 13 : పూర్వ విద్యార్థుల నెట్వర్క్ల సేవల సంస్థ వావ్.. వ్యాపార రంగంలో నిలదిక్కుకోవడానికి తన పేరును హుప్స్టర్గా మార్చుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ పరేష్ మాట్లాడుతూ.. వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి వచ్చే ఏడాది మరో 5-10 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలనుకుంటున్నట్టు చెప్పారు.
ఇప్పటికే రూ.6.6 కోట్ల నిధులను సమీకరించినట్టు, తద్వారా క్లయింట్లకు నూతన సేవలు అందించడానికి వీలుపడిందన్నారు.
హైదరాబాద్, మార్చి 13: బీమా సంస్థ స్టార్ హెల్త్.. బోగస్ క్లెయింలకు చెక్ పెట్టడానికి నూతన టెక్నాలజీ ఏఐ సేవలను వినియోగిస్తున్నది. ప్రస్తుతం ఏఐ ద్వారా 20 శాతం క్లెయిమ్లు జరుగుతుండగా, వచ్చే మూడేండ్ల కాలంలో ఈ పరిధిని 50 శాతానికి పెంచుకోనున్నట్టు కంపెనీ హోల్-టైం డైరెక్టర్ హిమాన్షు వాలియా తెలిపారు.