నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో(Nirmal Municipal Office) బుధవారం ఏసీబీ అధికారులు దాడులు (ACB raids)నిర్వహించారు. 15వేల రూపాయల లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ షాకీర్ పట్టుపడ్డాడు. బిల్ కలెక్టర్ భరత్ సర్వీస్ బుక్ ఎంట్రీ కొరకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. కాగా, మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేస్తుండటంతో ఉద్యోగ వర్గాల్లో కలవరం మొదలైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.