KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈసారి కూడా లీగల్ టీమ్‌కు అనుమతి లేదని ఏసీబీ స్పష్టం చేసినట్లు సమాచారం.
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమకేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి సోమవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందినగర్‌లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. లీగల్ టీమ్‌కు అనుమతి లేదంటూ నిలిపివేశారు. వారిని దించిన తర్వాతే ఆఫీస్‌లోకి రావాలన్నారు. అయితే లీగల్ టీమ్ ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్లతో వచ్చానన్నారు. లీగల్ టీమ్‌తో రావద్దని నోటీసుల్లో ఉందా, ఉంటే చూపించాలని పోలీసు అధికారులను ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Krishank | తొక్కుడు బిళ్ల ఆడే ఈ ముఖ్యమంత్రికి.. ఫార్ములా-ఈ రేస్ గురించి ఏం తెలుసు? : క్రిశాంక్
Telangana voters list | తెలంగాణ ఓటర్ల సంఖ్య 3.35 కోట్లు.. సవరించిన జాబితా వెల్లడించిన ఈసీ
Deputy CM Bhatti | ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం భట్టి ఫొటో మిస్.. ఆలస్యంగా గుర్తించిన ఆర్టీసీ అధికారులు