Deputy CM Bhatti | ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం భట్టి ఫొటో మిస్.. ఆలస్యంగా గుర్తించిన ఆర్టీసీ అధికారులు
Deputy CM Bhatti | హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం సందర్భంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో(Flexi )డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) ఫొటో మిస్సయ్యింది.
హనుమకొండ చౌరస్తా, జనవరి 6 : హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం సందర్భంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో(Flexi )డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) ఫొటో మిస్సయ్యింది. దీనిని ఆలస్యంగా గుర్తించిన అధికారులు అప్పటికప్పడు ఫొటో తీసుకొచ్చి అతికించారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానుండడంతో వారి ఫొటోలతో వేదికపై ఆర్టీసీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
అయితే ఇందులో డిప్యూటీ సీఎం భట్టి ఫొటో లేకపోవడంతో కార్యక్రమానికి వచ్చినవారు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన వరంగల్ రీజినల్ మేనేజర్ డీ విజయభాను, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భానుకిరణ్, మాధవరావు, డిపో మేనేజర్ మోహన్రావు అప్పటికప్పుడు భట్టి విక్రమార్క ఫొటోను తీసుకొచ్చి ఫ్లెక్సీకి అతికించి హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై కార్యక్రమానికి వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

