Telangana voters list : తెలంగాణకు సంబంధించి సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,66,41,489 మంది పురుష ఓటర్లు, 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదేవిధంగా మరో 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా రాష్ట్రంలో ఉన్నారు.
ఈ మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న ఓటర్లు 5,45,026 మంది కాగా, 85 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్ల సంఖ్య 2,22,091 గా ఉన్నది. ఎన్ఆర్ఐ ఓటర్లు 3,591 మంది ఉన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులైన ఓటర్లు 5,26,993 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకుగాను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,65,982 మంది, భద్రాచలంలో అత్యల్పంగా 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.