కాచిగూడ,నవంబర్ 15 : రైలు(Train) ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు(Young man died). కాచిగూడ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సమ్మయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి(25)శుక్రవారం ఉందానగర్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం-2లో కదులుతున్న కాచిగూడ-కర్నూల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై గొధుమ రంగు చొక్క, నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.6 ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాల కోసం 9948695948లో సంప్రదించాలని కోరారు.