డెహ్రాడూన్: ఏడుగురు విద్యార్థులు మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత బీఎండబ్ల్యూలో వేగంగా ప్రయాణించారు. ఆ కారు ప్రమాదంలో ఆరుగురు దారుణంగా మరణించారు. (Dehradun accident) వారి తెగిన తలలు, శరీర భాగాలు రోడ్డుపై పడ్డాయి. మృతుల్లో ముగ్గురు యువతులున్నారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 12న ఏడుగురు స్టూడెంట్స్ డెహ్రాడూన్‌లో జల్సా చేశారు. మందు పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ బీఎండబ్ల్యూ కారులో హైస్పీడ్‌లో ప్రయాణించారు. డెహ్రాడూన్‌లోని ఓఎన్జీసీ చౌక్‌లో ఆ కారు ప్రమాదానికి గురైంది. ఆరుగురు స్టూడెంట్స్ మరణించగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం తీవ్రత వల్ల స్టూడెంట్స్ తెగిన తలలు, శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల్లో ముగ్గురు యువతులున్నారు.
Students Killed
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన స్టూడెంట్స్‌ను డెహ్రాడూన్‌కు చెందిన
అతుల్ అగర్వాల్ (24), రిషబ్ జైన్ (24), నవ్య గోయెల్ ( 23), కామాక్షి( 20), గునీత్ కౌర్ (19), హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కునాల్ కుక్రేజా (23)గా గుర్తించారు. మందు పార్టీ ఇచ్చిన డెహ్రాడూన్‌కు చెందిన సిద్ధేష్ అగర్వాల్ (25) ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడు కోమాలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బీభత్స కారు ప్రమాదానికి ముందు ఆ స్టూడెంట్స్ మందు పార్టీ చేసుకున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Dehradun Accident
6 De@d including 3 Girls.
This is their last video before the tragedy
As evident from this video they indeed were drunk. pic.twitter.com/co0X7x1yvN— sumit 🇮🇳 (@sumit45678901) November 14, 2024