Vishwak Sen | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నవంబర్ 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది మాస్ కా దాస్ టీం. ఓ ప్రమోషనల్ ఈవెంట్లో విశ్వక్సేన్ చెప్పిన మాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
మెకానిక్ రాకీలో లోకల్ బాయ్‌గా కనిపిస్తానన్నాడు విశ్వక్సేన్. అయితే ఈ మూవీలో హీరోయిన్గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఆసక్తికర విషయం షేర్ చేశాడు. ఫలక్‌నుమా దాస్ సినిమా కోసం మొదట శ్రద్ధా శ్రీనాథ్‌నే హీరోయిన్గా తీసుకోవాలనుకున్నా. బెంగళూరుకు వెళ్లి ఆమెకు కథ చెప్పా. కాకపోతే ఆమె నో చెప్పింది. చేతుల్లో డబ్బులు లేకపోయినా ఖర్చు పెట్టుకొని బెంగళూరుకు వెళ్లి అనుకున్న పని కాకపోవడంతో కొంచెం బాధపడ్డా. కానీ ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్ నా సినిమా (మెకానిక్ రాకీ)లో నటిస్తుంటే ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.
ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రఘరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు.
The Rana Daggubati Show | నాకు ఏం తెలియదు.. ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ వచ్చేసింది
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ
మెకానిక్ రాకీ ట్రైలర్..