మెదక్ : పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌లోనే(
Ambulance) పండంటి మగబిడ్డకు(Delivery) జన్మనిచ్చింది. 108 వాహన సిబ్బంది స్వామి, ఆశా కార్యకర్త గౌరీ ఆమెకు ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళ్తే..మెదక్ జిల్లా(Medak district) నిజాంపేట మండల కేంద్రంలో బిహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళకు అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు. అనంతరం ధర్మారం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు. సకాలంలో స్పందించి కాన్పు చేసిన సిబ్బందిని పలువురు అభినందించారు.
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!