ఆదిలాబాద్ : రైతు ధర్నా కోసం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న మాఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు( KTR) ఉమ్మడి నిజామాబాద్(Nizamabad )జిల్లాలో ఘన స్వాగతం(Warm welcome) లభించింది. జాతీయ రహదారి -44 గుండా వెళ్తున్న కేటీఆర్ఖు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున సాదరంగా స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా సరిహద్దు బస్వాపూర్, కామారెడ్డి పట్టణ శివారులోని టేక్రియాల్, సదాశివనగర్, నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి వద్ద గులాబీ కార్యకర్తలను కేటీఆర్ కలుసుకున్నారు.
కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆదిలాబాద్ టూర్ఖు కేటీఆర్ వెళ్లారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ రణభేరి మోగిస్తున్నది. అందులో భాగంగా నేడు కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగనున్న రైతు నిరసన సభకు హాజరుకానున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్యర్యంలో జరుగుతున్న ఈ సభకు ఇప్పటికే భారీగా రైతులు, ప్రజలు తరలివస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఈ రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా..? కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన కేటీఆర్
KTR | ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పచెప్పడమేనా ఇందిరమ్మ రాజ్య అంటే..: కేటీఆర్