సూర్యాపేట : సూర్యాపేట(Suryapet district) మండలం టేకుమట్ల గ్రామం వద్దగల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సాయి కృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Travel bus)డ్రైవర్‌కు ఫిట్స్(Fits) రావడంతో బస్సు ఒక్కసారిగా చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమా దం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి