హైదరాబాద్: భాగ్యనగరంలో (Hyderabad) ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఒక్కోవారం ఒక్కో ప్రాంతంలో నెల రోజులపాటు బోనాల జాతర కొనసాగనుంది. ఇక బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మూడు రోజులపాటు కన్నుల పండువగా జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కల్యాణం జరిగే 9న, రథోత్సవం నిర్వహించే 10న భక్తులు విశేషంగా తరలిరానున్న నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
వాహనాల పార్కింగ్..
ఎస్ఆర్నగర్ టి-జంక్షన్ సమీపంలో ఆర్అండ్బీ కార్యాలయం, ఫుడ్‌వరల్డ్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ రోడ్డు సైడ్ పార్కింగ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ పార్కింగ్, ఫతేనగర్ రైల్వే వంతెన కింద పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. భక్తులు తమ వాహనాలను నిరీ్ణత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే సక్రమంగా పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.